KCR: ట్విటర్‌ (ఎక్స్‌)లో అడుగుపెట్టిన కేసీఆర్‌

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

Published : 27 Apr 2024 15:16 IST

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ట్విటర్‌ (ఎక్స్‌)లో ఖాతా తెరిచి.. సామాజిక మాధ్యమం ద్వారా మరింత చేరువయ్యారు. ఇప్పటి వరకు భారాస పార్టీ పేరుతో ట్విటర్‌ ఖాతా ఉంది. తాజాగా KCRBRSPresident పేరుతో ‘ఎక్స్‌’ ఖాతా ప్రారంభించారు. సామాజిక మాధ్యమం ద్వారా తమ అభిమాన నేత అందుబాటులోకి రావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణరాష్ట్ర ప్రజలకు భారాస పార్టీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్‌ మొదటి పోస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని