icon icon icon
icon icon icon

Raghunandan Rao: సీఎం రేవంత్‌ దుబ్బాక వస్తే నా ఇల్లు చూపిస్తా: రఘునందన్‌రావు

ముదిరాజ్‌లకు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మేలేంటో చెప్పాలని మెదక్‌ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు.

Published : 21 Apr 2024 14:14 IST

మెదక్‌: ముదిరాజ్‌లకు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మేలేంటో చెప్పాలని మెదక్‌ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. మెదక్‌లో సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తనకు గడీలు ఉన్నాయన్నారని.. ఎక్కడున్నాయో చెప్పాలని నిలదీశారు. రేవంత్‌రెడ్డి దుబ్బాక వస్తే తన ఇల్లు చూపిస్తానని తెలిపారు. సీఎం బాధ్యతాయుతంగా మాట్లాడాలని కోరారు. కొన్నిసార్లు పోటీ చేసే స్థానాలు మారడం సాధారణమేనన్నారు. సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని రఘునందన్‌రావు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img