icon icon icon
icon icon icon

Revanth reddy: విభజన హామీలపై జవాబు చెప్పాకే మోదీ తెలంగాణకు రావాలి: రేవంత్‌రెడ్డి

ప్రధాని నరేంద్రమోదీ పదేళ్ల పాలనలో తెలంగాణకు నిధులు, పరిశ్రమలు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  మండిపడ్డారు. 

Updated : 28 Apr 2024 22:13 IST

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ పదేళ్ల పాలనలో తెలంగాణకు నిధులు, పరిశ్రమలు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  మండిపడ్డారు. భాజపాకు ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారట.. ఎందుకు వేయాలి? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తారో జవాబు చెప్పాకే మోదీ తెలంగాణకు రావాలని డిమాండ్‌ చేశారు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాకే మోదీ రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు. అందుకే రాష్ట్రంలో భాజపాని బహిష్కరించాలి, ఈ ఎన్నికల్లో పడగొట్టాలి అని పిలుపునిచ్చారు. 

మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీత మహేందర్‌రెడ్డికి మద్దతుగా ఎల్బీనగర్, వనస్థలిపురంలో నిర్వహించిన రోడ్‌ షోలో సీఎం ప్రసంగించారు. ఈ నియోజకవర్గం నుంచి సునీతకు 30వేల మెజార్టీ ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హయత్‌నగర్‌ వరకు మెట్రోను విస్తరించే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు. వరద ముంపు సమస్యను పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్‌ ఏనాడైనా మీ సమస్యలు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చారా అని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామని అప్పటి భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. బండి రాలేదు గుండు రాలేదు.. కానీ, ఇప్పుడు అరగుండు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను నిండా ముంచేందుకు ప్రధానమంత్రి మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ కారు తూకానికి వెళ్లింది.. ఇక తిరిగి రాదని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img