icon icon icon
icon icon icon

Revanth Reddy: మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడు దొంగలే: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో ఐదు గ్యారంటీలు అమలు చేశామని, త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కూడా పూర్తిచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 22 Apr 2024 16:11 IST

ఆదిలాబాద్‌: తెలంగాణలో ఐదు గ్యారంటీలు అమలు చేశామని, త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కూడా పూర్తిచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జనజాతర’ సభలో ఆయన మాట్లాడారు. ‘‘నాగోబా జాతరకు రూ.4 కోట్లు కేటాయించనున్నాం. కుప్టి ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తాం. తుమ్మిడిహట్టిలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కడతాం.. దానికి బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెడతాం. ఆదిలాబాద్‌లో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడుదొంగలే. 

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అన్నదాత పండించిన ప్రతి గింజ కొంటున్నాం. ఉచిత బస్సుల్లో 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. పదేళ్లలో కేసీఆర్‌ ఉద్యోగాలు ఇవ్వకుంటే.. కాంగ్రెస్‌ 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది. బీసీ జనగణన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ఉన్న సీసీఐ సిమెంట్‌ పరిశ్రమను మోదీ, కేసీఆర్‌ కలిసి మూసేశారు. తొందరల్లోనే దీన్ని తెరిపిస్తాం. రూ.500కే మేం గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని వాళ్లిద్దరూ అంటున్నారు. ఉచిత కరెంటుతో పేదల ఇళ్లు వెలుగుతుంటే వాళ్ల కడుపు మండుతోంది. గత ప్రభుత్వ పాలనలో పండించిన ధాన్యం కొనకపోవడంతో రైతులు కల్లాల్లోనే చనిపోయారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img