icon icon icon
icon icon icon

TS News: తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 625 నామినేషన్లు

తెలంగాణలో నామినేషన్ల పరిశీలన తర్వాత 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 625 నామినేషన్లు ఆమోదించినట్టు ఈసీ అధికారికంగా ప్రకటించింది.

Published : 27 Apr 2024 22:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలో నామినేషన్ల పరిశీలన తర్వాత 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 625 నామినేషన్లు ఆమోదించినట్టు ఈసీ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 893 మంది 1,488 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 268 మందికి చెందిన 428 సెట్లను ఈసీ తిరస్కరించింది. మల్కాజిగిరిలో 114 మంది నామినేషన్లు వేయగా.. వాటిలో 77 తిరస్కరణకు గురయ్యాయి. మెదక్‌లో ఒక నామినేషన్‌ చెల్లుబాటు కాకపోగా.. 53 ఆమోదించారు.

ఆదిలాబాద్‌లో 10, పెద్దపల్లిలో 14, కరీంనగర్‌లో 20, నిజామాబాద్‌లో 10, జహీరాబాద్‌లో 14, సికింద్రాబాద్‌లో 11, హైదరాబాద్‌లో 19, చేవెళ్లలో 18, మహబూబ్ నగర్‌లో 7, నాగర్ కర్నూలులో 13, నల్గొండలో 25, భువనగిరిలో 10, మహబూబాబాద్‌లో 5, ఖమ్మంలో 4, వరంగల్‌లో 10 నామినేషన్లను తిరస్కరించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. పరిశీలన అనంతరం ఆదిలాబాద్‌లో 13, పెద్దపల్లిలో 49, కరీంనగర్‌లో 33, నిజామాబాద్‌లో 32, జహీరాబాద్‌లో 26, సికింద్రాబాద్‌లో 46, హైదరాబాద్‌లో 38, చేవెళ్లలో 46, మహబూబ్ నగర్‌లో 35, నాగర్ కర్నూలులో 21, నల్గొండలో 31, భువనగిరిలో 51, వరంగల్‌లో 48, మహబూబాబాద్‌లో 25, ఖమ్మంలో 41 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించినట్లు చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 29న ముగియనుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈసీ వెల్లడించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img