icon icon icon
icon icon icon

Uttam Kumar Reddy: ‘ఇండియా కూటమి’ విజయం తథ్యం: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

Published : 09 May 2024 15:04 IST

హైదరాబాద్: నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. భాజపా, భారస ..తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలవాలని చూస్తున్నాయని విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

‘‘తెలంగాణ ప్రజలకు భాజపా ఏమీ చేయలేదు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోంది. దానిని జీర్ణించుకోలేకే భాజపా ఏదేదో మాట్లాడుతోంది. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ ఎన్నికల్లో మేం అద్భుత విజయం సాధించడం ఖాయం. మా పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయి’’ అని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img