icon icon icon
icon icon icon

Venkatesh: ఖమ్మంలో విక్టరీ వెంకటేశ్‌ రోడ్‌ షో

 ప్రముఖ సినీనటుడు వెంకటేశ్‌ ఖమ్మంలో రోడ్‌ షో నిర్వహించారు.

Updated : 07 May 2024 20:16 IST

ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఆయన వియ్యంకుడు సినీ నటుడు విక్టరీ వెంకటేష్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోకు వెంకటేశ్‌ అభిమానులతో పాటు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటేశ్‌ ముందుకు సాగారు. రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img