Fake hotel : అదో పేద్ద ‘హోటల్’.. అందులో గదులుండవు!
ఆస్ట్రేలియాలోని ఓ నకిలీ హోటల్(Fake hotel) అందరినీ బోల్తా కొట్టిస్తోంది. అక్కడ బస చేద్దామని వెళ్లిన వారంతా దాని నిర్మాణం చూసి ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
(Image : Twitter)
చూడటానికి అదో పెద్ద హోటల్(Hotel). అటుగా వెళ్తున్న వాహనదారులు బస చేద్దామని దాని గురించి నెట్(Internet)లో శోధిస్తే ఎలాంటి సమాచారం దొరకదు. నేరుగా బుకింగ్(Booking) చేసుకుందామని దగ్గరకు వెళ్తే అసలు దానికి ప్రవేశ ద్వారమే ఉండదు. దూరం నుంచి చూసినప్పుడు పెద్దగా కనిపించిన హోటల్(Hotel) దగ్గరకు వెళ్లిన తర్వాత చాలా చిన్నగా ఉండి తికమక పెడుతుంది. ఎక్కడుందీ హోటల్.. దాని విశేషాలేంటో చదివేయండి.
ఆస్ట్రేలియా(Australia)లోని మెల్‌బోర్న్ నగర శివారులో ఈ ఉత్తుత్తి హోటల్ ‘ఈస్ట్ర్‌లింక్’ కన్పిస్తుంది. చాలా దూరం నుంచి చూస్తే అదో ఆకాశహర్మ్యంలా దర్శనమిస్తూ పర్యాటకులను రారమ్మని పిలుస్తున్నట్లుగా ఉంటుంది. రాత్రి వేళలో కొన్ని గదులు బుకింగ్ అయిపోయినట్లుగా అందులోని కొన్ని కిటికీల లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఆశగా ఆ హోటల్(Hotel) దగ్గరకు వెళ్తే మాత్రం భంగపాటుకు గురికావాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ బోర్డు తప్ప నిజమైన హోటల్ లేదు. ఓ ఫైవ్‌స్టార్ హోటల్ చూడటానికి ఎలా ఉంటుందో ఆ భ్రమ కల్పించేలా నాలుగు గోడల నిర్మాణం ఉంటుంది. లోపలికి వెళ్లేందుకు మార్గం కూడా లేదు. పైన మాత్రం సౌర ఫలకాలను అమర్చారు. రాత్రిపూట ప్రజల్ని మాయ చేసేందుకు వాటి సహాయంతో ఉత్తుత్తి కిటికీల్లోని లైట్లను వెలిగిస్తుంటారు. మొత్తానికి ఓ సినిమా సెట్ తరహాలో కేవలం వినోదం కోసం ఆ భవనాన్ని నిర్మించారు. చుట్టుపక్కల నిర్మాణాలేవీ లేకపోవడంతో ఆ హోటల్ వాహనదారులను అమితంగా ఆకర్షిస్తోంది.
కెనడాకు చెందిన ఆర్టిస్ట్ క్యాలమ్ మోర్టాన్ ఈ ‘ఉత్తుత్తి హోటల్’ను డిజైన్ చేశాడు. దీనిని నిర్మించడానికి 1.2 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు ఖర్చు చేశారు. భారతీయ కరెన్సీలో రూ.6.6 కోట్లకు పైగా ఉంటుంది. కాంక్రీట్, ఇనుము వినియోగించి దీనిని నిర్మించారు. ముందు వైపు ఆకర్షణగా ఉండేందుకు గాజు గ్లాసులను అమర్చారు. 2007 నుంచి ఈ హోటల్ ఈస్ట్ర్‌లింక్ మోటార్‌వే పై ప్రయాణించే వాహనదారులందరినీ బోల్తా కొట్టిస్తోంది. ఆ మార్గంలో వేగంగా వెళ్తూ ఈ హోటల్‌ను చూస్తే.. దీనిలో ఓ గది దొరికితే చాలు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చనే ఆశ వాహనదారుల్లో పుడుతుంది. అందుకోసం ఆన్‌లైన్‌లో శోధిస్తే ఎలాంటి సమాచారం లభించదు. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే భవనం కేవలం 20 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల మందం మాత్రమే ఉంటుంది. ఇది కేవలం అలంకారప్రాయంగా నిర్మించిన కట్టడమని తెలిసి అంతా పెదవి విరుస్తున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై