Sundar Pichai : ఇదీ సుందర్ పిచాయ్ లగ్జరీ లైఫ్.. ఎన్ని కార్లున్నాయంటే!
గూగుల్ (Google) మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet) సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఏడాదికి రూ.1850కోట్ల వేతనం అందుకుంటున్నారు. అంత జీతం అందుకుంటున్న ఆయన ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు. ఏఏ వాహనాలు వాడుతున్నారో తెలుసుకోండి.
అతడో ఓ సాధారణ మధ్య తరగతి కుర్రాడు. చదువులో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. దాంతో వాళ్ల నాన్న అతడిని అమెరికా పంపించాలనుకున్నాడు. కానీ, విమాన టికెట్ కొనాలంటే తన ఏడాది జీతం ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. అయినా కొడుకు భవిష్యత్తే ముఖ్యమని ముందుకెళ్లాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఆ కొడుకు ఇప్పుడు ఏడాదికి రూ.1850 కోట్ల జీతం అందుకుంటున్నాడు. అతడెవరో కాదు గూగుల్ (Google)మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet)సీఈఓ సుందర్ పిచాయ్.
ఒక సాధారణ ఉద్యోగిగా గూగుల్‌లోకి అడుగుపెట్టిన సుందర్ పిచాయ్ ఆ సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్ ఇలాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ ఆయన ఆలోచనల నుంచే పుట్టుకొచ్చాయి. ఆ కష్టానికి ప్రతిఫలంగా 2015లో ఆయనకు సీఈవో పదవి దక్కింది. దాంతో అత్యధిక వేతనం అందుకుంటున్న టెక్ దిగ్గజంగా అవతరించారు. అత్యంత సామాన్య నేపథ్యం నుంచి ఈ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ విలాసవంతమైన జీవితంపై ఓ లుక్కేయండి.
కళ్లు చెదిరే సౌధం
చెన్నైలో ఉన్నప్పుడు ఇరుకు ఇంటి కష్టాలు చూసిన సుందర్ పిచాయ్ ప్రస్తుతం తన కుటుంబం కోసం 4 కోట్ల డాలర్ల విలువైన కలల సౌధాన్ని నిర్మించుకున్నాడు. కాలిఫోర్నియా రాష్ట్రం శాంటాక్లారా కౌంటీలోని లాస్ ఆల్టోస్‌లో 31.17 ఎకరాల్లో ఆ భవనం ఉంది. ఆ ఇల్లు అంత ఖరీదు ఉండటానికి గల కారణం దాని కళాత్మక నిర్మాణమే. సుందర్ సతీమణి అంజలి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరీ ప్రతి మూలను డిజైన్ చేయించిందట. కేవలం మార్పుచేర్పుల కోసమే 49 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ ఇంటి సమీపంలో కొలను, ఇన్‌ఫినిటీ పూల్, జిమ్, స్పా, వైన్ సెల్లార్ వంటి సౌకర్యాలున్నాయి. కరెంటు కష్టాలు రాకుండా మేడపై సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. లిఫ్టు సదుపాయం ఉంది.
రూ. 3.21 కోట్ల కారు
సుందర్ పిచాయ్‌కున్న చరాస్తుల్లో మెర్సిడెస్ ఎస్650 అత్యంత ఖరీదైన వాహనం. మన దేశ ప్రధాని నరేంద్రమోదీ భద్రతా కాన్వాయ్‌లోనూ ఈ కారును వినియోగిస్తున్నారు. దీని విలువ దాదాపు 3.21 కోట్లు. ఈ వాహనంలో 6.0 లీటర్ల ట్విన్ టర్బో వీ12 ఇంజిన్ ఉంటుంది. అది 523 హార్స్‌పవర్ శక్తిని విడుదల చేస్తుంది. 830 న్యూటన్ మీటర్ల టార్క్‌తో పనిచేసే ఈ వాహనం గంటకు 190 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. వాతావరణానికి తగ్గట్టుగా మారిపోవడం ఈ కారులోని మరో ప్రత్యేకత.
బీఎండబ్ల్యూ 730 ఎల్‌డీ
సుందర్ పిచాయ్ ఆటోమొబైల్స్ కలెక్షన్లలో బీఎండబ్ల్యూ 730 ఎల్‌డీ కారు ఉంది. రాజసం ఉట్టిపడే దీని విలువ రూ.1.35 కోట్లు. ఇంజిన్ సామర్థ్యం 2993 సీసీ. వాతావరణానికి తగ్గట్లుగా మారే సదుపాయం ఈ కారులోనూ ఉంది.
మెర్సిడెస్ వీ క్లాస్
టెక్ వరల్డ్ టైటాన్ వాడే మరో కారు మెర్సిడెస్ వీ క్లాస్. దీని ధర 71.05 లక్షలు. దీని ఇంజిన్ శ్రేణి 1950 సీసీ నుంచి 2143 సీసీ వరకు ఉంటుంది. ఇందులో ఏడుగురు దర్జాగా ప్రయాణించొచ్చు.
టయోటా హైఏస్
కుటుంబంతో సుదూర ప్రయాణాలకు టయోటా హైఏస్ అనువుగా ఉంటుంది. సుందర్ పిచాయ్ గ్యారేజీలో ఈ వాహనం కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 55 లక్షలు. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది 17 సెకన్లలోనే అందుకోగలదు.
Image : Bill Gross
టెస్టింగ్ కోసం మొబైల్స్
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు ఖరీదైన మొబైల్ ఫోన్లపై కూడా ఆసక్తి ఎక్కువే. పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ 7 ప్రొ, శామ్‌సంగ్ గెలాక్సీ, ఐ ఫోన్ వంటివన్నీ ఆయన వాడుతుంటారు. అయితే తాను ఫోన్లను ఎక్కువగా టెస్టింగ్ కోసమే వినియోగిస్తుంటానని ఓ సందర్భంలో వెల్లడించారు.
స్మార్ట్ వాచ్‌లు
గతంలో నిర్వహించిన వివిధ మీడియా సమావేశాల్లో, సెమినార్లలో సుందర్ పిచాయ్ చేతికి వాచ్ కనిపించేది కాదు. కానీ, టెక్నాలజీని నిరంతరం అన్వేషించే ఆయన ఈ మధ్య స్మార్ట్ వాచ్‌లపై దృష్టిపెట్టారు. తరచూ ఫాజిల్ స్పోర్ట్, గూగుల్ పిక్సెల్ వాచ్‌లు ధరించి కనిపిస్తున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!