Lucky pilot : ‘ఏడు రోజుల్లో.. ఏడు ప్రమాదాలు’.. ఈ పైలట్‌కు భూమ్మీద నూకలున్నాయ్!
అమెరికాలోని మిచిగాన్కు చెందిన ఓ పైలట్ ఏడు రోజుల్లో ఏడు ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
‘అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తీసేవరకు తడుతూనే ఉంటుందట’ మరి అమెరికాలోని(America) మిషిగాన్‌కు చెందిన ఓ పైలట్(pilot) ఎంతటి అదృష్టవంతుడో.. ఏడు రోజుల్లో తాను నడిపిన విమానం(flight) ఏడుసార్లు ప్రమాదాలకు గురైంది. అయినా కూడా బతికి బయటపడ్డాడు. ఆయన ఫ్లయింగ్ లైసెన్స్(flying license) మాత్రం రద్దు కావడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.
మిషిగాన్‌కు చెందిన డెన్నిస్ కోలియర్కు గతంలో పైలట్‌గా అనుభవం ఉంది. 20 ఏళ్ల తరువాత మళ్లీ ఆయనకు గాల్లో ఎగరాలనే కోరిక పుట్టింది. 2021లో సొంతంగా విమానం కొనుగోలు చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం ఆన్లైన్లో(online) శోధించగా దాదాపు రూ.కోటి రూపాయల ధరలో ఒక చిన్న విమానం కనిపించడంతో దాన్ని కొనేశాడు. ఆ విమానం కాలిఫోర్నియాలో ఉందని తెలిసి తెచ్చుకోవడానికి వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత తెలిసిన విషయం ఏంటంటే.. ఆ విమానం రెండేళ్లుగా మూలన పడి ఉందని.. పైగా అందులోని కొన్ని భాగాల అమరిక సరిగా లేదు. రెక్కలపై ఉండే ఫ్లాప్స్, టైల్ అడపాదడపా పనిచేస్తున్నాయి. ఇంత దారుణంగా విమానం ఉన్నప్పటికీ కోలియర్ దానిని కొనడానికే మొగ్గు చూపాడు. అంతే.. అతడి జీవితం డేంజర్లో పడిపోయింది. ఏడు రోజుల్లో ఏడు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
- జూన్ నెలాఖరులో తొలిసారి టెస్ట్ కోసం విమానం ఎక్కాడు. అప్పటికే డెన్నిస్ విమానం నడిపి ఇరవై ఏళ్లు దాటడంతో దిగేటప్పుడు ల్యాండింగ్ గేర్(landing gear) వేయడం మర్చిపోయాడు. దాంతో కింద భాగం నేలకు రాసుకుంటూ.. భారీ చప్పుడు చేసుకుంటూ విమానం ఆగింది.
- మొదటి ప్రమాదం జరిగిన కొంచెం సేపటి తరువాత కాలిఫోర్నియా నుంచి న్యూ మెక్సికోకు బయలుదేరాడు. అప్పుడు ల్యాండింగ్ లైట్స్ సరిగా పనిచేయడం లేదని తెలిసింది. దాంతో రన్ వే(run way) ఎక్కడుందో? నేల ఎక్కడుందో కనిపించకపోవడంతో అలాగే ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొన్ని సూచికలు, విద్యుద్దీపాలను ఢీకొట్టాడు. ఈ ఘటన కారణంగా విమానం కొన్ని మరమ్మతులకు గురైంది.
- ఒక రోజు విరామం తర్వాత జూన్ 28న మళ్లీ ప్రయాణం మొదలుపెట్టింది. అయితే గతంలోని ప్రమాదాల వల్ల విమానం స్థితి ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దాంతో మరోసారి రన్‌వే లైట్‌ను ఢీకొంది.
- హార్డ్‌వేర్ దుకాణంలో మరమ్మతులు పూర్తయిన తరువాత జూన్ 30న డెన్నిస్ మళ్లీ విమానం నడిపాడు. నెబ్రాస్కా రాష్ట్రంలోని ఓనీల్ వైపు ప్రయాణం సాగించాడు. విమానం గాల్లో ఉండగా.. ఎడమ రెక్క హింగ్డ్ ట్యాబ్ ఇరుక్కుపోయిందని గ్రహించాడు. దాంతో ల్యాండ్ చేయడం కష్టతరంగా మారింది. నాలుగుసార్లు విఫలయత్నం చేశాడు. చివరికి ల్యాండ్ అయ్యే సమయంలో మూడు లైట్లను ఢీకొట్టాడు. రన్ వే నుంచి విమానం పక్కకు దూసుకెళ్లింది. దాంతో ఎడమ రెక్కను కంట్రోల్ చేసే ఓ మోటారు పగిలిపోయింది.
- ఐదో ప్రమాదం నెబ్రాస్కాలోనే చోటు చేసుకుంది.
- ఆరో ప్రమాదం జులై 3న జరిగింది. ఎస్కనాబా పై ఎగురుతూ ఉండగా.. ఎడమ ల్యాండింగ్ గేర్ దానికై అదే కిందకు జారింది. దాంతో మానిస్టిక్లోని స్కూల్క్రాఫ్ట్ కౌంటీ విమానాశ్రయంలో ల్యాండ్ చేయాలని పైలట్ నిశ్చయించుకొన్నాడు. కిందకి దించుతున్నప్పుడు రన్‌వే నుంచి విమానం జారిపోయింది. ఫలితంగా ముందు భాగం, నోస్ గేర్ డోర్ దెబ్బతింది.
- ఇక చివరి.. ఏడో ప్రమాదం జులై 4న సంభవించింది. డెన్నిస్ అప్పటికి తన గమ్యస్థానం బోయిన్ సిటీకి 80 మైళ్ల దూరంలో ఉన్నాడు. విమానం మిషిగాన్ లేక్‌పై ఎగురుతూ ఉంది. ఇంజిన్‌లోని(engine) నుంచి కొన్ని ద్రవాలు లీక్ అయ్యాయి. దీంతో తన పని ముగిసిపోయింది.. ఇక చావే శరణ్యం అనుకున్నాడు. గమ్మత్తైన విషయం ఏమిటంటే.. డెన్నిస్ కొన్నది ఉభయచర విమానం. నేలపైనా.. నీళ్లపైనా ల్యాండ్ కావచ్చు. కానీ, ఏం ప్రయోజనం.. మళ్లీ ఫ్లాప్స్ పనిచేయడం మానేశాయి. చివరికి విమానం నీళ్లపై వాలిపోయింది. అప్పటికే అప్రమత్తంగా ఉన్న డెన్నిస్ విమానం శిథిలాలపై ఎక్కి నిల్చున్నాడు. గంట సేపటి తరువాత యూఎస్ కోస్ట్ గార్డ్స్ వచ్చి అతడిని కాపాడారు.
ఇన్ని ప్రమాదాలను ఎదుర్కొన్నా డెన్నిస్‌కు ఒక్క గాయం కూడా కాలేదు. ఏ ప్రమాదంలోనూ అతడి శరీరంపై చిన్న గీత కూడా పడలేదు. విమానం కొనుగోలు చేసి ఇంటి తెచ్చుకోవాలనే తన ప్రణాళిక మొత్తం నాశనమైపోయిందని జరిగిన ఘటనలను డెన్నిస్ వివరించాడు. ఏడు ప్రమాదాలకు కారణమైన విమానం అసలు యజమాని మాత్రం తాను విక్రయించిన సమయంలో అదంతా బాగానే ఉందని మీడియాకు తెలిపాడు. ఎక్కువ విమాన ప్రమాదాలు చేసిన కారణంగా డెన్నిస్ కోలియర్ ఫ్లయింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్‌స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్‌టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్‌లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్‌కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్‌లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్‌సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్‌పేయీ, కమల్‌నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్‌మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్‌లో రకుల్‌ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్‌రావు