India map: భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?

Sri lanka: భారత చిత్రపటంలో శ్రీలంకను మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా?

Published : 25 Oct 2023 16:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ దేశ సార్వభౌమత్వానికైనా ఆ దేశ చిత్రపటం ప్రతీక. ఎప్పుడైనా దేశ చిత్రపటాన్ని తప్పుగా చూపిస్తే.. అది నేరంగా భావిస్తారు. భారత్‌ చిత్రపటాన్ని తప్పుగా చూపించడం పలుమార్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే, మన దేశ చిత్ర పటాన్ని నిశితంగా గమనిస్తే.. దిగువ భాగంలో శ్రీలంక దర్శనమిస్తుంది. మరి దాన్నీ నేరంగా పరిగణించాలి కదా అనే అనుమానం రావొచ్చు. కానీ, అలా చూపించకపోవడమే నేరమట. దీనికి కారణం సముద్ర చట్టం. ఈ కారణంతోనే భారత మ్యాప్‌లో శ్రీలంకను కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.

సముద్ర చట్టాన్ని (Ocean law) ఐక్యరాజ్య సమితి రూపొందించింది. దీని ప్రకారం.. ఒక దేశ సరిహద్దు సముద్రానికి ఆనుకొని ఉంటే దాదాపు 200 నాటికల్ మైళ్ల వరకు.. అంటే దాదాపు 370 కిలోమీటర్లు ఆ దేశ సముద్ర ప్రాంతంగా పరిగణిస్తారు. భారతదేశం సముద్ర సరిహద్దులో శ్రీలంక కూడా వస్తుంది. వాస్తవానికి తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకకు దూరం కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. సముద్ర చట్టం కారణంగానే భారతదేశం తన మ్యాప్‌లో శ్రీలంకను చూపించడం తప్పనిసరి.

సముద్ర చట్టంపై 1956లో ఐక్యరాజ్యసమితి సమావేశం నిర్వహించినప్పుడు.. అనేక దేశాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఆ సమయంలో సముద్ర సరిహద్దులు, సంబంధిత ఒప్పందాలపై లోతైన చర్చ జరిగింది. 1973- 1982 మధ్య జరిగిన మూడో సమావేశంలో ఈ చట్టం చేశారు. ఈ కాలంలోనే అనేక సముద్ర, అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలు జరిగాయి. అందులో ఒకటి ఈ సముద్ర చట్టం. దీని ప్రకారం ఏ దేశపు మ్యాప్‌లోనైనా ఆ దేశం బేస్‌లైన్ నుంచి 200 నాటికల్ మైళ్ల పరిమితిని చూపించడం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలోనే శ్రీలంకను కూడా భారత్‌లో చూపిస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని