Yakutia: యకుటియా.. ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం!

ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు తగ్గితేనే ఆ చలిని మనం తట్టుకోలేం. కానీ, జమ్ముకశ్మీర్‌లోని పర్వత ప్రాంతాలు సహా, కొన్ని దేశాల్లో జీరో.. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గడ్డకట్టుకుపోయే చలిలో అక్కడి ప్రజలు రోజువారీ కార్యకలాపాలు ఎలా కొనసాగిస్తారనే సందేహం చాలా మందిని తొలుచేస్తుంటుంది. ఆ సందేహాని

Published : 29 Jul 2021 23:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు తగ్గితేనే ఆ చలిని మనం తట్టుకోలేం. కానీ, జమ్ముకశ్మీర్‌లోని పర్వత ప్రాంతాలు సహా, కొన్ని దేశాల్లో జీరో.. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గడ్డకట్టుకుపోయే చలిలో అక్కడి ప్రజలు రోజువారీ కార్యకలాపాలు ఎలా కొనసాగిస్తారనే సందేహం చాలా మందిని తొలిచేస్తుంటుంది. ఆ సందేహాన్ని తీర్చడానికే యూట్యూబర్‌ సెనెట్‌ ఓ డాక్యుమెంటరీ రూపొందించాడు. ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతమైన రష్యాలోని యకుటియా నగరానికి వెళ్లి.. అక్కడి ప్రజల జీవనశైలిని చిత్రీకరించి.. తన యూట్యూబ్‌ ఛానెల్‌ డిస్కవర్‌ విత్‌ సెనెట్‌లో ఇటీవల పోస్టు చేశాడు. సెనెట్‌ పర్యటిస్తున్నప్పుడు యకుటియాలో ఉష్ణోగ్రత -50డిగ్రీలు ఉందట. అక్కడి సాధారణ ఉష్ణోగ్రతే అంత. 

నగర పర్యటనలో గమనించిన అనేక విషయాలను సెనెట్‌ ఆ వీడియోలో వివరించాడు. అక్కడి ప్రజలు ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని ఖర్చు చేస్తున్నట్లు తెలిపాడు. చలిని తట్టుకోవడం కోసం కారు ఇంజిన్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచుతున్నారు. ఇంజిన్‌ వేడెక్కడం వల్ల కారు చుట్టూ వాతావరణం కాస్త వెచ్చగా ఉంటుందని అలా చేస్తారట. శరీరంలో వేడి ఉండటం కోసం నిత్యం మాంసాహారం తింటున్నారు. ఈ క్రమంలో వండుకోగా మిగిలిన మాంసాన్ని ఇంటి కిటికీల వద్ద వేలాడదీస్తున్నారు. ఇలా చేయడం వల్ల చలి వాతావరణంలో మాంసం పాడవకుండా ఉంటుంది. అలాగే చలి లోపలికి రాకుండా ఈ మాంసం అడ్డుకుంటుందని ఈ ఆలోచన చేశారు. నగరంలో పలువురిని కలిసినప్పుడు వారు చలిని తట్టుకోవడం కోసం ఎన్ని స్వెటర్లు వేసుకుంటారో చూపించాడు. ఒక మహిళ ఐదారు స్వెటర్లు ధరించడం వీడియోలో గమనించొచ్చు. వీటితోపాటు సెనెట్‌ నగరంలోని మంచుతో కప్పబడి ఉన్న రోడ్లు, పొగమంచుతో నిండిన వీధులు వంటి అందమైన దృశ్యాలను చిత్రీకరించాడు. ఆ వీడియోని ఇప్పటి వరకు 8లక్షల మంది వీక్షించారు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని