వింతవ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణం!

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పలువురి అస్వస్థతకు పురుగు మందుల అవశేషాలే కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. దిల్లీ ఎయిమ్స్‌,

Published : 17 Dec 2020 00:49 IST

సీఎం జగన్‌ వద్ద అభిప్రాయాలు వ్యక్తం చేసిన నిపుణులు

దిల్లీ ఎయిమ్స్‌, ఎన్‌ఐసీటీకి అధ్యయన బాధ్యతలు

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పలువురి అస్వస్థతకు పురుగు మందుల అవశేషాలే కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. వింతవ్యాధిపై సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో దిల్లీ ఎయిమ్స్‌, ఎన్‌ఐసీటీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌) సహా ప్రముఖ  పరిశోధనా సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. సమీక్షలో భాగంగా కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. శరీరాల్లోకి పురుగు మందుల అవశేషాలు ఎలా  ప్రవేశించాయన్న దానిపై అధ్యయనం అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన సీఎం.. దిల్లీ ఎయిమ్స్‌, ఎన్‌ఐసీటీకి అధ్యయన బాధ్యతలను అప్పగించారు. 

ఏలూరులో క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని.. ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని జగన్‌ సూచించారు. ఫలితాల ఆధారంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎస్‌ నీలం సాహ్నిని సీఎం ఆదేశించారు. ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని