కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు సీఎం జగన్‌ లేఖ

కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు సీఎం జగన్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌, బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌లను నిషేధించాలని కోరారు

Updated : 29 Oct 2020 10:50 IST

అమరావతి: కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు సీఎం జగన్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌, బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌లను నిషేధించాలని కోరారు. రాష్ట్రంలో మొత్తం 132 వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌, బెట్టింగ్‌కు కారణమవుతున్నాయని.. వాటిని నిషేధించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బెట్టింగ్‌, గాంబ్లింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లకు ముఖ్యంగా యువత బానిసవుతున్నారని.. ఆర్థికంగా నష్టపోతున్నారని సీఎం లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1974 ఏపీ గేమింగ్‌ చట్టంలో సవరణలు తీసుకొచ్చిన విషయాన్ని లేఖలో సీఎం ప్రస్తావించారు. ఆ చట్టం ద్వారా నిందితులను కఠినంగా శిక్షించే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని