రిమ్స్‌  నుంచి కరోనా బాధితుల పరారీ

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న 10 మంది కరోనా పాజిటివ్ బాధితులు పరారైన ఘటన కలకలం రేపుతోంది. పరారైన వారిలో ఐదుగురు పురుషులు, మరో ఐదుగురు మహిళలు ఉన్నట్లు రిమ్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ఇంద్రవెల్లి మండలవాసులు ఇద్దరు, నిజామాబాద్‌ వాసి ఒకరు..

Published : 02 Aug 2020 00:57 IST

ఆదిలాబాద్‌ వైద్య విభాగం: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న 10 మంది కరోనా పాజిటివ్ బాధితులు పరారైన ఘటన కలకలం రేపుతోంది. పరారైన వారిలో ఐదుగురు పురుషులు, మరో ఐదుగురు మహిళలు ఉన్నట్లు రిమ్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ఇంద్రవెల్లి మండలవాసులు ఇద్దరు, నిజామాబాద్‌ వాసి ఒకరు ఉండగా.. ఆదిలాబాద్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన వారు ఇద్దరు, కైలాస్‌ నగర్‌, ఖానాపూర్‌, ద్వారకానగర్‌, కుమ్మరికుంట కాలనీ వాసులు ఒక్కొక్కరు ఉన్నారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలానికి చెందిన మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. సిబ్బంది ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తుండగా బాధితులు తప్పించుకున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ బానోత్‌ బలరాం చెబుతున్నారు. బాధితుల పరారీపై జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారమిచ్చినట్లు రిమ్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. బాధితుల చరవాణి ఆధారంగా బాధితుల ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, అవి అందుబాటులో లేనట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని