తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. లోగిళ్లతో పాటు దుకాణ సముదాయాలు దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి. కరోనా ప్రభావంతో పండగ సంబరం కొంత కళ తప్పినా పిల్లలు, పెద్దలు..

Updated : 14 Nov 2020 22:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. లోగిళ్లతో పాటు దుకాణ సముదాయాలు దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి. కరోనా ప్రభావంతో పండగ సంబరం కొంత కళ తప్పినా పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఆనందోత్సాహాల నడుమ పండగను జరుపుకుంటున్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూనే ప్రజలు పండగ చేసుకుంటున్నారు. విద్యుత్ కాంతులు, బాణసంచా శబ్దాలతో మార్మోగిపోవాల్సిన నగరాలు, పట్టణాలు ఈసారి బోసిపోయాయి. కేవలం దీపాల వెలుతురులోనే సాధారణ స్థాయిలో పండగను జరుపుకుంటున్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆశించిన స్థాయిలో పండగ వాతావరణం కనిపించడం లేదు. పూర్తి అవగాహనతో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటూనే పండగ నిర్వహించుకుంటున్నారు. కాలుష్యం, కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలు ఎక్కడ కూడా పెద్ద స్థాయిలో బాణసంచా కాల్చడం లేదు. దీపావళి రోజున వారి పిల్లల ఆనందాన్ని కాదనకుండా మాస్కులు ధరించి పిల్లలతో సహా పెద్దవారు వారి ఇళ్ల ముందే చిన్న చిన్న క్రాకర్స్‌ కాలుస్తూ సంతోషంగా జరుపుకుంటున్నారు.

దీపావళి, బాలల దినోత్సం సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు.  కొవిడ్ కారణంగా వేడుకలు గొప్పగా నిర్వహించుకోనప్పటికీ.. ఉత్సవ స్ఫూర్తి ఎక్కువగానే ఉందన్నారు. వచ్చే ఏడాది దీపావళి వేడుకలను కరోనా రహిత స్థితిలో నిర్వహించుకుంటామని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్సవాల సందర్భంగా రాజ్‌భవన్‌లో చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.



ఆనందాల కేళి.. దీపావళి.. ఫొటో గ్యాలరీ

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని