బిస్కెట్‌ కప్పుల్లో టీ.. నెటిజన్ల ప్రశంసలు

ప్లాస్టిక్‌ కప్పులు వినియోగించి పర్యావరణానికి హాని తలపెట్టొద్దనుకున్న ఓ టీ దుకాణం యజమానికి మహత్తరమైన ఆలోచన తట్టింది. ప్లాస్టిక్‌ టీ కప్పుల స్థానంలో బిస్కెట్లతోనే టీ కప్పులను తయారు చేయించి...

Published : 12 Dec 2020 01:43 IST

మదురై: ప్లాస్టిక్‌ కప్పులు వినియోగించి పర్యావరణానికి హాని తలపెట్టొద్దనుకున్న ఓ టీ దుకాణం యజమానికి మహత్తరమైన ఆలోచన తట్టింది. ప్లాస్టిక్‌ టీ కప్పుల స్థానంలో బిస్కెట్లతోనే టీ కప్పులను తయారు చేయించి వాటిలోనే వేడివేడి చాయ్‌ని అందిస్తున్నారు. ఈ వినూత్న ఆలోచనకు రుచి తోడవ్వడంతో గిరాకీ సైతం పెరిగిపోయింది. తమిళనాడులోని మదురైకి చెందిన వివేక్‌ సబాపతి.. ఆర్‌ఎస్‌ పాతీ నీల్‌గిరి పేరుతో టీ స్టాల్‌ను నడుపుతున్నారు. 1909లోనే ఆయన పూర్వీకులు ఆ టీ స్టాల్‌ను ప్రారంభించారు. అయితే ప్రభుత్వం ప్లాస్టిక్‌ కప్పులపై నిషేదం విధించిన తర్వాత ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి కలిగే నష్టం గురించి సబాపతి తెలుసుకున్నారు. ఇకపై ప్లాస్టిక్‌ వాడకూడదని నిశ్చయించుకున్నారు. అప్పుడే బిస్కెట్‌ టీ కప్పుల ఆలోచనకు తెరలేపారు.

చాయ్‌లో బిస్కెట్లని ముంచుకొని తినడాన్ని వినియోగదారులు ఇష్టపడతారన్నది తెలిసిన విషయమే. దీని ఆధారంగానే వివేక్‌ ఈ నూతన ఒరవడికి తెరలేపారు. టీ తాగిన తర్వాత ఈ బిస్కెట్‌ కప్పును కూడా తినేయొచ్చు. రూ.20కి ఒక టీ కప్పును విక్రయిస్తున్నారు. ఈఏడాది జూలైలో ప్రారంభించిన బిస్కెట్ కప్‌ టీని తాగేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. పర్యావరణహితమైన ఈ టీ స్టాల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ తరహా టీ స్టాళ్లు మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇవీ చదవండి...

రైల్వే ఇకపై మరింత పర్యావరణ హితం

అక్కడ టీ ధర రూ.1000!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని