చలికి వణుకుతూ.. ఫుట్‌పాత్‌లపైనే..

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండలేకపోతున్న నేపథ్యంలో నిరాశ్రయుల పరిస్థితి దయనీయంగా ఉంది....

Published : 26 Dec 2020 06:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండలేకపోతున్న నేపథ్యంలో నిరాశ్రయుల పరిస్థితి దయనీయంగా ఉంది. విశాఖలో నిరాశ్రయులు రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లపై చలికి వణుకుతూ దుప్పట్లు లేకుండానే నిద్రిస్తున్నారు. వారి బాధలు పట్టించుకునే నాథులే లేరు. ద్వారక బస్టాండ్‌ నుంచి రైల్వేస్టేషన్ మార్గంలో ఉన్న ఫుట్‌పాత్‌పై వీరు అధికంగా కనిపిస్తుంటారు. చలి తీవ్రంగా ఉందని, నానా అవస్థలు పడుతున్నామని నిరాశ్రయులు ఆవేదన వెల్లగక్కుతున్నారు.

వీరి బాధలు చూస్తున్న కొంతమంది దాతలు దుప్పట్లు, భోజనాలు అందిస్తున్నారు. అభ్యాగ్యుల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని దాతలు ఈసందర్భంగా కోరుతున్నారు. కనీసం శీతాకాలంలోనైనా నిరాశ్రయుల్ని, యాచకుల్ని సురక్షిత ప్రాంతాల్లో ఉంచే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి...

గుండెపోటుకు వజ్ర చికిత్స!

అక్కడ సర్పాలే దైవాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని