
Updated : 31 Oct 2020 16:19 IST
దర్శనం టికెట్లు లేవని ఆందోళనకు దిగిన భక్తులు
ఇంటర్నెట్ డెస్క్: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం శనివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి తితిదే శుక్రవారం రాత్రే టికెట్లు జారీ చేసింది. ఫలితంగా ఈరోజు టికెట్లు లేకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల ఆన్‌లైన్‌పై అవగాహన లేని అనేకమంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూదేవి కాంప్లెక్స్‌కు వచ్చిన అదనపు ఈఓ ధర్మారెడ్డి భక్తులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆదివారం, సోమవారం దర్శనాలకు సంబంధించిన టోకెన్లను జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Tags :