Health: కాలేయం మార్పిడి ఎప్పుడు అవసరమో తెలుసా..?

కాలేయం తొంభైశాతం పాడైనా మందులతో బాగు చేసే అవకాశం ఉంటుంది. క్యాన్సర్‌, సిర్రోసిస్‌ బారిన పడినపుడు కాలేయాన్ని మందులతో బాగు చేయలేం. ఇలాంటి పరిస్థితిలో తప్పనిసరిగా కాలేయ మార్పిడి సర్జరీకి వెళ్లక తప్పదు.

Published : 30 Jun 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలేయం తొంభైశాతం పాడైనా మందులతో బాగు చేసే అవకాశం ఉంటుంది. క్యాన్సర్‌, సిర్రోసిస్‌ బారిన పడినపుడు కాలేయాన్ని మందులతో బాగు చేయలేం. ఇలాంటి పరిస్థితిలో తప్పనిసరిగా కాలేయ మార్పిడి సర్జరీకి వెళ్లక తప్పదు. కుటుంబ సభ్యుల నుంచో, చనిపోయిన వ్యక్తుల నుంచో కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడికి దారితీసే పరిస్థితులు, సర్జరీ గురించి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జన్‌ ఆర్వీ రాఘవేంద్రరావు వివరించారు.

కాలేయం కీలకం

మన శరీరానికి కాలేయం ఇంజన్‌ లాంటిది. విటమిన్లు, గ్లూకోజ్‌, విటమిన్లు, ఐరన్‌ వంటి వాటిని నిల్వ చేసుకొని అవసరమైనపుడు శక్తిని విడుదల చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి పోషకాలు అందడానికి ఉపయోగపడే పైత్యరసాన్ని విడుదల చేస్తుంది. రక్తంలో కలిసే వ్యర్థాలను, విషతుల్యాలను బయటకు పంపిస్తుంది. ఎంతో కీలకమైన కాలేయం దెబ్బతింటే శరీర వ్యవస్థలన్నీ కుప్పకూలుతాయి. ఇది పని చేయకపోతే మార్పిడి తప్పదు. కాలేయం దెబ్బతిన్నట్టు కామెర్లతోనే తెలుస్తుంది. 

మార్పిడి ఇలా సాధ్యం

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి నుంచి, కుటుంబ సభ్యుల నుంచి కాలేయాన్నిసేకరించడానికి వీలుంది. ఇది మూడు, నాలుగు నెలల్లో సాధారణ స్థాయికి వస్తుంది. పనితీరు మెరుగు పడుతుంది. ఈ ఆపరేషన్‌ చేయడం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆ శస్త్రచికిత్సకు వాడే మందులతో ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్లు కూడా వస్తాయి. జీవనశైలిలో మార్పు కచ్చితంగా చేయాలి. ఆల్కహాల్‌ పూర్తిగా మానేయాలి. ఆహార నియమాలు పాటించాలి. మాంసం తీసుకోవద్దు. క్రమం తప్పకుండా కొంతకాలం వైద్యులను కలుస్తుండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని