Health: క్లోమగ్రంధిలో వాపు ప్రాణాంతకమా? తెలుసుకోండి..

తినగానే పొట్టలో నొప్పి మొదలవుతుంది. అది కూడా బొడ్డు పైభాగంలో వస్తే ఆలస్యం చేయకండి. వెంటనే వైద్యులను సంప్రదించండి

Published : 24 Jun 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తినగానే పొట్టలో నొప్పి మొదలవుతుంది. అది కూడా బొడ్డు పైభాగంలో వస్తే ఆలస్యం చేయకండి. వెంటనే వైద్యులను సంప్రదించండి. తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పొట్ట నొప్పి వెనక పాంక్రియాటైటీస్‌ కారణం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. క్లోమగ్రంధికి ఇన్‌ఫెక్షన్‌ సోకి వాపు వచ్చినపుడు అది క్రమంగా తనను తానే జీర్ణం చేసుకుంటూ మనల్ని మృత్యుముఖంలోకి తీసుకెళ్తుంది. ప్రాణాంతకంగా మారే ఈ పాంక్రియాటైటీస్‌ గురించి సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు పీవీ రమణమూర్తి వివరించారు.

క్లోమగ్రంధి ఏం చేస్తుందంటే: క్లోమగ్రంధి మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడంతో పాటు కీలకమైన ఇన్సులిన్‌ హార్మొన్‌ను స్రవించడంతో శరీరంలో మధుమేహం స్థాయిని సమతుల్యంలో ఉంచుతుంది. ఏదైనా కారణంతో క్లోమగ్రంధిలో అడ్డంకులు ఎదురయినపుడు క్లోమరసం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుంది. ఇలాంటప్పుడు వాపు మొదలవుతుంది.

వాపు ఎందుకొస్తుందంటే..: క్లోమగ్రంధిలో వాపు ఎక్కువగా మధ్యపానం, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నపుడు వస్తుంది. ఆల్కాహాల్‌ తాగినపుడు తర్వాతి రోజు బాగా కడుపునొప్పి రావడం, వాంతులు రావడం, నడుం లోపల పొడిచినట్టు ఉంటుంది. ఇది పాంక్రియాటైటీస్‌ అని నిర్థారణ అయితే ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాలి. రక్తంలో ట్రైగ్లిసరైడ్‌ కొవ్వు, కాల్షియం శాతం ఎక్కువగా ఉన్నా క్లోమగ్రంధి వాపు వస్తుంది. ఆస్తమాను అదుపులో పెట్టే మందులతో కూడా రావచ్చని తెలుస్తోంది.

చికిత్స ఎలాగంటే: పాంక్రియాటైటీస్ వచ్చిందని గుర్తించిన తర్వాత రోగి స్థితి ఆధారంగా ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది. రక్త ప్రసరణ తగ్గి కొంత భాగం కుళ్లిపోయినట్టు అయి ఇన్‌ఫెక్షన్‌ సోకితే వందకు వందశాతం ఓపెన్‌ ఆపరేషన్‌ చేయాల్సిందే. ఈ పరిస్థితి వచ్చినపుడు వందలో 40 మందికి ప్రాణాంతకంగా మారుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని