Vijayawada: పోలీసు కస్టడీకి వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు

ఇటీవల అరెస్టయిన వాణిజ్య పన్నులశాఖలోని నలుగురు ఉద్యోగులను విజయవాడ రెండవ ఏసీఎంఎం కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది.

Published : 06 Jun 2023 22:20 IST

విజయవాడ: ఇటీవల అరెస్టయిన వాణిజ్య పన్నులశాఖలోని నలుగురు ఉద్యోగులను విజయవాడ రెండవ అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ (ఏసీఎంఎం) కోర్టు 3 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. నిందితులను ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించాలని పోలీసులను ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మహిళా ఉద్యోగిని విచారించే సమయంలో మహిళా పోలీసు ఉండాలని కోర్టు తెలిపింది. 

కోర్టు ఆదేశాల ప్రకారం ఈనెల 7 నుంచి 9 వరకు పోలీసులు విచారణ జరపనున్నారు. వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులను నాలుగు రోజుల కస్టడీ కోరుతూ పటమట పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై విచారణజరిపిన న్యాయస్థం.. 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం చేకూర్చారనే ఆరోపణలతో పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఐదో నిందితుడిగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ పేరును పోలీసులు చేర్చారు . ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని