విశాఖ ఉక్కుపై చిరంజీవి సంచలన ట్వీట్‌

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రముఖ నటుడు చిరంజీవి సంచలన ట్వీట్‌ చేశారు. విశాఖ ఉక్కు రోజుకు 100 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తుందన్నారు. ఇలా కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం..

Updated : 22 Apr 2021 18:56 IST

హైదరాబాద్‌: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రముఖ నటుడు చిరంజీవి సంచలన ట్వీట్‌ చేశారు. విశాఖ ఉక్కు రోజుకు 100 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తోందని, కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడుతోందని అన్నారు. అలాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం ఎంతవరకు సబబు? అని చిరంజీవి ప్రశ్నించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ఇక్కడి నుంచే ఆక్సిజన్‌ అందుతోందని ఆయన ట్వీట్‌ చేశారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలను మానుకోవాలని కేంద్రానికి సూచించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని