AP corona: కొత్తగా 4,549 కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,756 నమూనాలను పరీక్షించగా..4,549 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో

Updated : 14 Jun 2021 18:20 IST

అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,756 నమూనాలను పరీక్షించగా..4,549 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,14,393 మంది వైరస్‌ బారినపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 59 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,999కి చేరింది. తాజాగా 10,114 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 17,22,381 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,013 యాక్టివ్‌ కేసులున్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,05,38,738 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, ప్రకాశంలో 8 మంది, పశ్చిమగోదావరిలో ఆరుగురు, కృష్ణ జిల్లాలో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం,విజయనగరం జిల్లాల్లో ముగ్గురు, కడప, నెల్లూరులో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని