Andhra News: మహిళలపై దాడుల్లో యూపీ, బిహార్‌ను మించిపోయిన ఏపీ: కేంద్రం

మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా లోక్‌సభలో వెల్లడించారు.

Updated : 20 Dec 2022 19:50 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు ఏటా పెరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 2018 నుంచి పోల్చితే 2021 నాటికి ఏపీలో అత్యాచారాలు 22శాతం, దాడులు 15శాతం, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసులు 31శాతం పెరిగాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు లోక్‌సభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘2018 నుంచి 2021 మధ్య కాలంలో ఏపీలో మహిళలపై 4,340 అత్యాచారాలు, 8,406 ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఉదంతాలు, 18,883 సాధారణ దాడులు జరిగాయి. మహిళలపై జరుగుతున్న దాడుల్లో యూపీ, బిహార్‌ను ఏపీ మించిపోయింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉంది’’ అని అజయ్ మిశ్రా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని