Flowers Valley: ఫ్లవర్స్‌ వ్యాలీ.. భూమిపై ఉన్న స్వర్గలోకం

పూల సువాసనలు.. సెలయేళ్ల చప్పుళ్లు.. మంచుకొండల అందాలు.. జలధారల సోయగాలు..

Published : 31 Aug 2021 16:02 IST

పూల సువాసనలు.. సెలయేళ్ల చప్పుళ్లు.. మంచుకొండల అందాలు.. జలధారల సోయగాలు.. తలుచుకుంటేనే స్వర్గం కళ్ల ముందు కనిపిస్తుంది. అలాంటి చోటుకు నిజంగానే వెళ్తే.. మాటల్లో చెప్పలేని ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు. ఏడాదిగా ఇళ్లకే పరిమితమైన ప్రజలకు అలాంటి అనుభూతిని పంచిపెడుతోంది ఉత్తరాఖండ్‌లోని ఫ్లవర్స్‌ వ్యాలీ. ఉత్తరాఖండ్‌.. యాత్రికులకు స్వర్గధామం. అక్కడి ప్రకృతి సోయగాలు.. భువిపై దివిని తలపిస్తాయి. అందుకే ఎప్పుడెప్పుడు ఛార్‌ధామ్‌ యాత్ర చేపడదామా, వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌లో కొండలపై పరుచుకున్న పూల అందాలను ఆస్వాదిద్దామా అని.. పర్యటకులు ఊవిళ్లూరతారు. అక్కడి నుంచి సిక్కుల పుణ్యక్షేత్రం హేమ్‌కుండ్‌ సాహిబ్‌కు చేరే క్రమంలో పారే సెలయేళ్లు మనసును పులకరింపజేస్తాయి. వీటన్నింటినీ ఏడాదిగా దూరం చేసింది కరోనా. అయితే ఈ జులై 1న వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌కు దేశీయ, విదేశీ యాత్రికులను నంద దేవి బయోస్పియర్‌ రిజర్వ్‌ అనుమతించడం వల్ల అక్కడ మరోసారి యాత్రికుల తాకిడి పెరిగింది.వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌కు వెళ్లాలంటే మాత్రం యాత్రికులు కచ్చితంగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేసుకోవాల్సిందేనని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా నగరాల్లో తిరగడం కన్నా ప్రకృతి ఒడికి చేరుకోవడానికే పర్యటకులు మొగ్గుచూపుతున్నారు. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌కు చేసే ట్రెక్కింగ్‌ మరచిపోలేదని అనుభూతిని ఇచ్చిందని అంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని