Viveka Murder Case: వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy)కి మరోసారి సీబీఐ(CBI) నోటీసులు జారీ చేసింది.

Updated : 05 Mar 2023 09:08 IST

పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy)కి మరోసారి సీబీఐ(CBI) నోటీసులు జారీ చేసింది. విచారణకు ఈనెల 6న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీబీఐ అధికారులు శనివారం రాత్రి పులివెందులలోని ఎంపీ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు.

అయితే 6వ తేదీన విచారణకు రాలేనని ఎంపీ చెప్పగా.. కచ్చితంగా రావాల్సిందేనని సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండుసార్లు సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డిని విచారించారు. జవవరి 28, ఫిబ్రవరి 24న విచారించిన అధికారులు.. వివేకా హత్యకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు. 

ఎంపీ తండ్రికీ..

అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 6న కడపలో విచారణకు రావాలని ఆయనకు సూచించారు. ఈనెల 12న విచారణకు హాజరుకావాలని గతంలో కోరిన సీబీఐ అధికారులు.. తాజాగా వెళ్లి 6వ తేదీనే రావాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని