Chandrababu Arrest: అక్టోబరు 5వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగించిన ఏసీబీ కోర్టు

తెదేపా అధినేత చంద్రబాబు రిమాండ్‌ను అక్టోబరు 5వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Updated : 24 Sep 2023 21:01 IST

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) రెండ్రోజుల సీఐడీ కస్టడీ, రిమాండ్‌ ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆన్‌లైన్‌ ద్వారా విచారణ చేపట్టారు. చంద్రబాబు రిమాండ్‌ పొడిగించాలని సీఐడీ అధికారులు కోరగా.. అక్టోబరు 5వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ కస్టడీ ముగిసిన తరువాత  రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచే వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు.

‘‘విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారా? ఏమైనా అసౌకర్యం కలిగిందా? వైద్య పరీక్షలు చేయించారా? అని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. చంద్రబాబును ప్రశ్నించారు. విచారణలో అధికారులు ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు జడ్జికి చెప్పారు. సీఐడీ విచారణలో ఏ అంశాలు తేలాయో వివరాలు ఇవ్వగలరా అని చంద్రబాబు కోర్టును కోరారు. విచారణలో తేలిన విషయాలు బయటపెట్టకూడదని జడ్జి తెలిపారు. కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు దాఖలు చేసిన 500 పేజీల కాపీలను మీ న్యాయవాది ద్వారా పంపిస్తాం తీసుకోవాలని చంద్రబాబుకు తెలిపారు. బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని