CM KCR: ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం.. ప్రారంభించిన కేసీఆర్

ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

Updated : 22 Jun 2023 15:56 IST

కొల్లూరు: ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా జిల్లా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 15,660 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ గృహాల సముదాయానికి ‘కేసీఆర్‌ నగర్‌ 2బీకే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీ’గా నామకరణం చేశారు. ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆరుగురు లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలను సీఎం అందజేశారు. అనంతరం అక్కడి గృహాలను కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు. 

ఈ గృహ సముదాయంలో ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టారు. 117 బ్లాకులుగా విభజన చేశారు. జీ+9, జీ+10, జీ+11 అంతస్తుల చొప్పున కట్టారు. 37శాతం భూమిలో ఇళ్లు నిర్మించారు. మిగిలిన 63శాతం భూమిలో మౌలిక సదుపాయాలు కల్పించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు