Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (24-06-2022)
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.శివనామాన్ని జపించండి.
మీ మీ రంగంలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ బంధువుల ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.
విఘ్నాలను తెలివిగా పరిష్కరిస్తారు. చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దల పట్ల గౌరవమర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
చేపట్టిన పనులలో ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివారాధన శుభప్రదం.
పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. హనుమత్ ఆరాధన శుభప్రదం.
గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అందరినీ కలుపుకొనిపోవడం ఉత్తమం. శ్రీసూక్తం విన్నా, చదివినా మంచి ఫలితాలు సాధిస్తారు.
ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.
మంచి కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధనధాన్యవృద్ధి ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శివనామస్మరణ శుభప్రదం.
మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. శ్రీనరసింహస్వామి ఆరాధన శుభకరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!