Health: ఇలా తినండి.. కిడ్నీలో రాళ్లున్నా ఇబ్బందులుండవు..!

సరిగా నీళ్లు తాగనపుడు, మిశ్రమ ఆహారం ఎక్కువగా తీసుకున్నపుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. 

Published : 24 Jun 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరిగా నీళ్లు తాగనపుడు, మిశ్రమ ఆహారం ఎక్కువగా తీసుకున్నపుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. వేళకు భోజనం చేయక పోయినా, సరయిన పద్ధతిలో నీరు తాగకపోయినా రాళ్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే కిడ్నీలో రాళ్లున్నా సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులుండవు. ఆహారంతోనూ కిడ్నీలో రాళ్లు లేకుండా చేసే అవకాశం ఉంటుందని పోషకాహార నిపుణులు  అంజలీదేవి చెబుతున్నారు.

* తినే ఆహారంలో ఖనిజ లవణాలు సరిగా జీర్ణం కాకుండా ఉన్నపుడు కిడ్నీలో రాళ్లుగా మారుతాయి. 

* కూరగాయలు, ఆకుకూరలను కలిపి వండుకొని తిన్నా రాళ్లు వచ్చే అవకాశం ఉంది.

* క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోవాలి.  ఆలస్యంగా రాత్రిపూట భోజనం చేయొద్దు. వ్యాయామం చేయకపోయినా ఇబ్బందులు  వస్తాయి.

* కంటి నిండా నిద్ర పోని వారికి కూడా రాళ్లు ఎక్కువగా వస్తాయి. కాల్షియం ఉన్న ఆకుకూరలు, అక్సిలైట్‌ ఉన్న కూరగాయలు తగ్గించుకుంటే రాళ్లు వచ్చే అవకాశాలు తక్కువ. 

* నీరు ఎక్కువగా తీసుకోవడంతో చిన్న చిన్న రాళ్లు మూత్రంలో వెళ్లిపోతాయి. చక్కెర, ఉప్పు చాలా వరకు తగ్గించాలి.

* కాల్షియం రాళ్లు వస్తున్నాయని పాలు, పెరుగు మానేస్తారు. ఇది సరికాదు. తగు మోతాదులో తింటే ఇబ్బందులుండవు. ఇవి కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

* పాలకూర, టమాటా తింటే అక్సలైట్‌ రాళ్లు వచ్చే వీలుంది. కానీ తగ్గించి తిన్నట్లయితే సమస్య కాదు. విడివిడిగా తీసుకుంటే ఇబ్బందులుండవు. 

* యూరిక్‌ యాసిడ్‌ రాళ్లున్న వారు మాంసం, ఆల్కహాల్ మానేయాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని