Updated : 04 May 2021 11:34 IST

Eatala: హైకోర్టును ఆశ్రయించిన కుటుంబం

హైదరాబాద్‌: భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ఈటల సతీమణి, కుమారుడు, జమునా హేచరీస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తమకు సంబంధించిన భూముల్లో సర్వే చేసి బోర్డులను పెట్టారని జమునా హేచరీస్‌ కోర్టుకు వివరించింది. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని.. బలవంతపు చర్యలు తీసుకోకుండా డీజీపీ, విజిలెన్స్, మెదక్‌ కలెక్టర్‌ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. మెదక్‌ జిల్లా అచ్చంపేటలో అసైన్డ్ భూముల కబ్జా చేశారనే ఆరోపణలతో ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన విషయం తెలిసిందే.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని