EC: ఎన్నికల వేళ బ్యాంకుల్లో లావాదేవీలపై నిఘా.. ఈసీ ఆదేశం

సార్వత్రిక ఎన్నికల వేళ.. బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 

Published : 19 Mar 2024 22:40 IST

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల వేళ.. బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల్లో రూ.లక్షకు మించి జమ, విత్‌ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్‌ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని సూచించింది. రూ.లక్షకు మించి జమ, డిపాజిట్‌ చేసిన అభ్యర్థి లేదా కుటుంబసభ్యుల, పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని తెలిపింది. రూ.10లక్షల జమ, డిపాజిట్ల వివరాలు ఐటీకి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు సమాచారం తెప్పించుకోవాలని, అనుమానం ఉంటే వాటి వివరాలు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు ఇవ్వాలని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని