Hyderabad: సరూర్‌నగర్‌లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్.. రుచులను ఆస్వాదించిన నేతలు
నగరంలోని సరూర్‌నగర్‌లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు చేపలు, రొయ్యలతో చేసిన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు.

హైదరాబాద్: నగరంలోని సరూర్‌నగర్‌లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు చేపలు, రొయ్యలతో చేసిన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు. రంగారెడ్డి జిల్లా స్థాయిలో భాగంగా సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆమెతో పాటు జడ్పీ ఛైర్‌పర్సన్ అనిత, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మల్లేశం, దయానంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక మహిళా సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లనునేతలు పరిశీలించారు. అనంతరం చేపలు, రొయ్యలతో చేసిన వంటకాల రుచులను ఆస్వాదించారు.

Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.