గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద హైడ్రామా

నిర్మల్‌ జిల్లాలోని గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. కుంటాల పీఏసీఎస్‌ పరిధిలో గెలుపొందిన తెరాస రెబల్‌ అభ్యర్థిని కాంగ్రెస్‌ నేతలు తరలించే క్రమంలో గొడవకు ........

Updated : 15 Feb 2020 22:16 IST

నిర్మల్‌: నిర్మల్‌ జిల్లాలోని గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. కుంటాల పీఏసీఎస్‌ పరిధిలో గెలుపొందిన తెరాస రెబల్‌ అభ్యర్థిని కాంగ్రెస్‌ నేతలు తరలించే క్రమంలో గొడవకు దారి తీసింది. కుంటాల పీఏసీఎస్‌లో తెరాస, కాంగ్రెస్‌ మద్దతుదారులు చేరో 6 స్థానాల్లో విజయం సాధించారు. తెరాస గెలుపొందిన ఆరు స్థానాల్లో ఒక రెబల్‌ అభ్యర్థి కూడా ఉన్నాడు. తెరాస రెబల్‌ అభ్యర్థిని కాంగ్రెస్‌ కార్యకర్తలు వారి శిబిరానికి తరలిస్తున్నారంటూ తెరాస నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద అభ్యర్థిని తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య అక్కడ స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ అభ్యర్థి కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలపడంతో గొడవ సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని