
Published : 18 Mar 2020 22:05 IST
నిర్భయ దోషుల న్యాయవాదిపై కోర్టు ఆగ్రహం
దిల్లీ: నిర్భయ దోషుల తరఫు న్యాయవాది తీరుపై పటియాలా హౌస్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిసారీ చివరి క్షణంలోనే ఎందుకు కోర్టును ఆశ్రయిస్తారని మండిపడింది. నిర్భయ దోషులకు న్యాయపరంగా ఇంకొన్ని అవకాశాలు ఉన్నాయంటూ వారి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ బుధవారం మరోసారి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించింది. ఇందుకు గల కారణలతో తిహాడ్ జైలు ఉన్నతాధికారులు నుంచి గురువారం నివేదిక తీసుకురావాలని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్రరానా సూచించారు. దోషులకు ఇంకా ఎలాంటి అవకాశాలూ లేవని, వారి ఉరిశిక్ష అమలుకు కేవలం 36 గంటలు మాత్రమే సమయం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. నిర్భయ దోషులైన పవన్ గుప్తా, ముకేశ్‌సింగ్, అక్షయ్‌ఠాకూర్, వినయ్‌శర్మను ఈ నెల 20న ఉదయం 5.30గంటలకు ఉరితీయనున్నారు.
Tags :