FIITJEE నుంచి ఉచిత ఆన్‌లైన్‌ వేదిక

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడంతో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కోచింగ్‌ సెంటర్లూ తెరుచుకోవడం లేదు. విద్యార్థులు ఇళ్లకే పరిమితయ్యారు. దీంతో పోటీ....

Updated : 06 Apr 2020 17:23 IST

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కోచింగ్‌ సెంటర్లూ తెరుచుకోవడం లేదు. విద్యార్థులు ఇళ్లకే పరిమితయ్యారు. దీంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సులు అందించే వేదిక ‘మై ప్యాట్‌’ ఉచిత కోర్సులను అందిస్తోంది. ముఖ్యంగా జేఈఈ మెయిన్‌ -2020, జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2020, బిట్‌శాట్‌ -2020, ఎన్‌టీఎస్‌ఈ స్టేట్‌-2 2019-20 పరీక్షల కోసం సన్నద్ధమయ్యే వారు తమ పరీక్షల తేదీ వరకు ఈ సేవలను ఉచితంగా పొందొచ్చు.

2021, 2022 సంవత్సరాల్లో ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు సైతం మే 10వ తేదీ వరకు ఈ ఆన్‌లైన్‌ కోర్సులను ఉచితంగా పొందొచ్చని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి ఫిట్జీ (FIITJEE) నాలెడ్జ్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తుండగా.. దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ‘మైప్యాట్‌’ యూజర్లు ఇప్పటికే పలు పోటీ పరీక్షల్లో సత్తా చాటారు. ఐఐటీకి ఎంపికయ్యే ప్రతి ముగ్గురిలో ఒకరు మైప్యాట్‌ యూజర్లేనని, గత నాలుగేళ్లలో 14 వేల మంది ఐఐటీలో ప్రవేశం పొందారని ఆ సంస్థ తెలిపింది. మరిన్ని వివరాల కోసం mypat.in లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 121 0206ని సంప్రందించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని