నిర్మాణ రంగానికి పూర్తి సహకారం

నిర్మాణరంగానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని.. స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుక సరఫరా సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన

Updated : 02 May 2020 21:38 IST

తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ 

హైదరాబాద్‌: నిర్మాణరంగానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని.. స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుక సరఫరా సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, పోలిస్ కమిషనర్లు, క్రెడాయ్, ట్రెడాయ్ ప్రతినిధులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం అనుమతులు లభించిన నేపథ్యంలో పనులు కొనసాగించేలా మెటీరియల్, కార్మికులకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను ప్రాజెక్టు డెవలపర్లు చేసుకోవచ్చని సీఎస్‌ తెలిపారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వలసకార్మికుల్లో ప్రాజెక్టు డెవలపర్లు విశ్వాసం కలిగించాలని సూచించారు. కార్మికులకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు, వైద్య సదుపాయాలు కల్పిస్తూ కార్మికులు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎస్ చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నిర్మాణ రంగానికి సంబంధించిన మెటీరియల్ తీసుకెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని