కరోనా: అశ్వగంధతో  క్లినికల్‌ ట్రయల్స్‌

ఆయుర్వేద మూలిక అశ్వగంధపై ప్రభుత్వం క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనుంది. హైడ్రాక్సీ క్లోరిక్విన్‌తో పోలిస్తే కొవిడ్‌-19ను అడ్డుకోవడం, నియంత్రించడం, నయం చేయడంలో ఎంత సమర్థంగా పనిచేయనుందో తెలుసుకోనుంది. సీఎస్‌ఐఆర్‌ సాంకేతిక సిబ్బంది, ఐసీఎంఆర్‌ సహాయంతో ఆయుష్‌, వైద్య, శాస్త్ర సాంకేతిక...

Published : 07 May 2020 20:22 IST

ఆయుష్‌, వైద్య, ఐసీఎంఆర్‌, సీఎస్‌ఐఆర్‌ ఉమ్మడి పరీక్షలు

దిల్లీ: ఆయుర్వేద మూలిక అశ్వగంధపై ప్రభుత్వం క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనుంది. హైడ్రాక్సీ క్లోరిక్విన్‌తో పోలిస్తే కొవిడ్‌-19ను అడ్డుకోవడం, నియంత్రించడం, నయం చేయడంలో ఎంత సమర్థంగా పనిచేయనుందో తెలుసుకోనుంది. సీఎస్‌ఐఆర్‌ సాంకేతిక సిబ్బంది, ఐసీఎంఆర్‌ సహాయంతో ఆయుష్‌, వైద్య, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా ఈ ట్రయల్స్‌ చేపట్టనున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు.

స్వల్ప, మరికాస్త ఎక్కువ లక్షణాలున్న కొవిడ్‌-19 రోగులకు అశ్వగంధతో పాటు యష్టిమధు, గుడూచి+పిప్పలి, పాలీ హెర్బల్‌ ఫార్మలేషన్‌ (ఆయుష్‌-64)ను ఇస్తారని ఆయుష్‌ కార్యదర్శి వైద్య రాజేశ్‌ కొటెచా తెలిపారు. ఆయుష్‌-64ను మలేరియా నివారణకు ఉపయోగిస్తారు. ‘ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు రాకుండా, వస్తే నియంత్రించేందుకు ఆయుర్వేద ఔషధాల ప్రయోజనాలను నిర్ధారించేందుకు ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ ఉపయోగపడతాయి’ అని కొటెచా వెల్లడించారు.

కొవిడ్‌-19 నియంత్రణకు ఆయుష్‌ సలహాలను స్వీకరించాలనుకునే వారి అంగీకారం కోసం ‘సంజీవని’ మొబైల్‌ యాప్‌ను మంత్రి హర్షవర్దన్‌ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయుష్‌ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 50 లక్షల మందిని చేరుకొనేలా ఈ యాప్‌ను రూపొందించారు. కొవిడ్‌-19 అంతమయ్యాకా ఆయుష్‌ ప్రయోజనాలు కొనసాగేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని హర్షవర్దన్‌ అన్నారు. ఇతర చికిత్సా పద్ధతులకు ఆయుష్‌ మద్దతుగా నిలిచి బలం పెంచుతుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని