నడిరోడ్డుపై చిరుత...ఆందోళనలో జనం

లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల సంచారం కాస్త తగ్గడంతో అటవీ జంతువులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై గురువారం ఉదయం చిరుత కనిపించడంతో స్థానికులు

Updated : 14 May 2020 12:27 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల సంచారం కాస్త తగ్గడంతో అటవీ జంతువులు యథేశ్చగా తిరుగుతున్నాయి. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై గురువారం ఉదయం చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాలికి గాయమై కదల్లేని స్థితిలో చిరుత రహదారిపై కూర్చొని ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించారు. వాహనదారులపై చిరుత దాడి చేసే అవకాశముండటంతో జాతీయ రహదారిపై రాకపోకలను నియంత్రించారు. 

అటవీశాఖ, జూపార్క్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని సమీపంలో ఫంక్షన్‌హాలులోకి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ లారీ డ్రైవర్‌ను గాయపరిచింది. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఫంక్షన్‌ హాలు ప్రాంగణం నుంచి సమీపంలో ఉన్న బొప్పాయి తోటలోకి వెళ్లింది. డ్రోన్‌ కెమెరా సాయంతో చిరుత ఉన్న ప్రదేశాన్ని అధికారులు గుర్తించారు. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి చిరుతను బంధిస్తామని, ఆ తర్వత జూపార్క్‌కు తరలించి కోలుకున్న తర్వాత అటవీప్రాంతంలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు. 
 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని