20వ రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు 

దేశంలో పెట్రోల్‌ ధర పరుగుకు తెరపడటం లేదు. దేశ చరిత్రలో 20 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్‌ ధరలు పెరగడం ఇదే తొలిసారి. శుక్రవారం పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 16 పైసలు....

Updated : 26 Jun 2020 11:34 IST

దిల్లీ: దేశంలో పెట్రోల్‌ ధర పరుగుకు తెరపడటం లేదు. దేశ చరిత్రలో 20 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్‌ ధరలు పెరగడం ఇదే తొలిసారి. శుక్రవారం పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 16 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.80.13, డీజిల్‌ లీటరు ధర 80.19కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.8.93, డీజిల్‌పై రూ.10.07 పైసలు పెరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని