‘కరోనా’ వ్యాధికి మరొక ఔషధం!

కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) ని అదుపు చేయడానికి పలు రకాల ఔషధాలను ప్రయోగించి చూస్తున్నారు. ‘నిక్లోసమైడ్‌’ అనే నూతన ఫార్ములేషన్‌పై మ్యాన్‌కైండ్‌ ఫార్మా ప్రయోగాలు చేపట్టింది. ..

Updated : 12 Aug 2020 10:07 IST

‘నిక్లోసమైడ్‌’ పై మ్యాన్‌కైండ్‌ ఫార్మా పరీక్షలు

కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) ని అదుపు చేయడానికి పలు రకాల ఔషధాలను ప్రయోగించి చూస్తున్నారు. ‘నిక్లోసమైడ్‌’ అనే నూతన ఫార్ములేషన్‌పై మ్యాన్‌కైండ్‌ ఫార్మా ప్రయోగాలు చేపట్టింది. ఈ ఔషధంపై మొదటి దశ (ఫేజ్‌-1) క్లినికల్‌ పరీక్షలు చేపట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీ అయిన దేవూంగ్‌ ఫార్మాసూటికల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాధమిక (ప్రీ-క్లినికల్‌) పరీక్షల్లో ఈ ఔషధం మంచి ఫలితాలు సాధించినట్లు మ్యాన్‌కైండ్‌ ఫార్మా పేర్కొంది. మనదేశంలో దీనిపై మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు చేపట్టటానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి లభించినట్లు  మ్యాన్‌కౌండ్‌ ఫార్మా సీఓఓ అర్జున్‌ జునేజా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని