- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
CM KCR: ORRపై వాహనాలను చూడొచ్చా?.. కమాండ్ కంట్రోల్ నిపుణులకు కేసీఆర్ ప్రశ్నలు
హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం సందర్భంగా లోపల విభాగాలను సీఎం కేసీఆర్ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. కేంద్రంలో ఏకకాలంలో లక్ష కెమెరాలను చూసేందుకు వీలుందని పోలీస్ అధికారులు సీఎంకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, యాదాద్రి దేవాలయం, హైదరాబాద్, వరంగల్.. ఇలా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అనుసంధానం చేశామని చెబుతూ ఇక్కడి కమాండ్ కంట్రోల్ నుంచే సాంకేతిక నిపుణులు తెరపై సీఎం కేసీఆర్‌కు చూపారు. ఔటర్ రింగ్‌రోడ్‌పై వెళ్తున్న వాహనాలు కనిపిస్తాయా అని అడగ్గా అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా వాహనాలను చూడొచ్చని వారు వివరించారు.
సర్.. ఇక్కడే భోజనం చేయండి...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తమతో పాటు భోజనం చేయాలని అభ్యర్థించారు. ఫర్వాలేదు.. వెళ్తానంటూ కళ్లతోనే చెబుతుండగా... హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వచ్చి అభ్యర్థించారు. దీంతో ముఖ్యమంత్రి వారితో పాటు భోజనానికి వెళ్లారు.
ఇంకా ఖరారు కాని పేరు
కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెడతారంటూ గతంలో పోలీస్ అధికారులు తెలిపారు. మంచిపేరు పెట్టాలంటూ ప్రజలు, నెటిజన్లను సీవీ ఆనంద్ కోరారు. వేల సంఖ్యలో పేర్లు వచ్చాయి. వాటి నుంచి ఒక పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేస్తారని వివరించారు. ప్రారంభోత్సవం రోజైన గురువారం పేరు ప్రకటించలేదు. ఇంకా ఖరారు చేయలేదని పోలీస్ వర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20/08/2022)
-
World News
Cancer Deaths: ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
-
India News
Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
-
Sports News
T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్‌రౌండర్
-
Movies News
Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
-
World News
Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
- Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
- Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్ హిట్ ఎందుకు కాలేదంటే..!
- Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
- ponniyin selvan: ‘పొన్నియిన్ సెల్వన్’కు ద్వారాలు తెరిచింది ‘బాహుబలి’
- Nithyananda: నిత్యానందకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
- CBI Raids: కేజ్రీవాలే సీబీఐకి ఉప్పందించారేమో.. భాజపా సంచలన వ్యాఖ్యలు..!
- T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్‌రౌండర్
- Axar : జడేజాకు షాడో.. అప్పటివరకు జట్టులోకి అక్షర్ కష్టమే: భారత మాజీ ఆటగాడు
- Telangana News: కేంద్రం ఎందుకు ఇలా చేస్తోందో అర్థం కావట్లేదు: సీఎండీ ప్రభాకర్‌రావు