Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Aug 2023 09:18 IST

1. నాలుగు ప్యాకేజీలుగా మెట్రో విస్తరణ

మెట్రోరైలు మూడో దశ ప్రతిపాదిత మార్గాల ప్రాథమిక ప్రాజెక్ట్‌ నివేదిక(పీపీఆర్‌), సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌)లు తయారు చేసేందుకు కన్సల్టెంట్ల ఎంపికకు హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. అర్హత కల్గిన ప్రఖ్యాత కన్సల్టెంట్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఆర్‌ఎఫ్‌సీ) బిడ్లను ఈనెల 28 లోగా సమర్పించాలని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి కోరారు.. శనివారం నుంచి ఆర్‌ఎఫ్‌పీ డాక్యుమెంట్లను హెచ్‌ఎంఆర్‌ఎల్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చిన్న ప్రాణి... తీస్తోంది ప్రాణం..

నిజమే పలుకులో రెండక్షరాలు. పరిమాణంలో సూక్ష్మం. కానీ దాని సూదుల్లాంటి కాట్లకు ఎవరైనా కుదేలవ్వాల్సిందే. ఆ ఏముందిలే! అని తేలిగ్గా తీసేసేవారు ఆ గాయాలు అనుభవించిన వారిని అడిగితే తెలుస్తుంది వాటి తీవ్రత. చెంతనే ఉంటూ చేటు చేస్తున్న వాటిపై అవగాహన పెంచడానికి ప్రపంచ దోమ నియంత్రణ దినం ఏటా ఆగస్టు 20న నిర్వహిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భోరజ్‌, సాత్నాల మండలాల ఏర్పాటు

ఆదిలాబాద్‌ జిల్లా మండలాల ముఖచిత్రం మారనుంది. ప్రస్తుతం 18 మండలాలతో ఉన్న ఆదిలాబాద్‌లో ఇటీవలే బోథ్‌ నుంచి వేరుచేసి కొత్తగా సొనాల మండలాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా అతిపెద్ద మండలమైన జైనథ్‌లోని మెజార్టీ గ్రామాలు, బేల, ఆదిలాబాద్‌ గ్రామీణ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిసి కొత్తగా రెండు మండలాలు రూపుదిద్దుకున్నాయి. ఈ మేరకు సాత్నాల, భోరజ్‌ మండలాలను ఏర్పాటుచేస్తు ప్రభుత్వం నుంచి జీఓ ఆర్‌.టి.నెం.268 పేరిట శనివారం రెవెన్యూ(జిల్లా పరిపాలన) శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సారు.. కారులో సీటు ఎవరికో..!

శాసనసభ ఎన్నికల ముహూర్తం సమీపిస్తుండటంతో అన్ని పార్టీల్లో కాక మొదలైంది. ప్రధానంగా అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి ఈ సారి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టేందుకు పావులు కదుపుతోంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పార్టీ కార్యకలాపాల్లో దూకుడు పెంచింది. అత్యధిక శాతం సిట్టింగ్‌లకే ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ వస్తున్న సీఎం కేసీఆర్‌.. గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎస్సీ, ఎస్టీ రైతులపై ఇంత కక్షా!

నా ఎస్సీ... నా ఎస్టీ... అంటూ గొంతు చించుకునే సీఎం జగన్‌.. వారి గుండెల్లో గునపాలు దించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఎంతో ఉపయోగపడిన సూక్ష్మ సేద్య పథకాన్ని నీరుగార్చేశారు. ఆయన అధికారంలోకొచ్చాక తొలి మూడేళ్లపాటు ఆ పథకాన్ని పూర్తిగా నిలిపేసిన జగన్‌.. విమర్శలకు జడిసి నాలుగో ఏడాది నుంచి అమలు చేస్తున్నా.. రాయితీని వంద శాతం నుంచి 90 శాతానికి తగ్గించారు. అంతటితో ఆగలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పరీక్ష రాసినా.. రాయనట్టు.. కేయూ డిగ్రీ ఫలితాల్లో వింత

కాకతీయ యూనివర్సిటీ(కేయూ) పరిధిలో రెగ్యులర్‌ డిగ్రీ ఆరో సెమిస్టర్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. జూన్‌లో పరీక్షలు జరగ్గా.. మార్కుల జాబితాల్లో పరీక్షలు రాసినా గైర్హాజరైనట్లుగా ఫలితాలు ప్రకటించడంతో విద్యార్థులు హైరానా పడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ గురుకుల కళాశాల విద్యార్థుల్లో చాలా మందికి ఇదే పరిస్థితి ఎదురైంది. బీఎస్సీ (ఎంపీసీ) చదువుతున్న 31 మంది పరీక్ష రాసినా గైర్హాజరైనట్లుగా ప్రకటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. డ్రైవర్‌ లేని బస్సులూ వచ్చేశాయ్‌!

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరం రోబో ట్యాక్సీలు, డ్రైవర్‌ లేని బస్సులతో ప్రయోగాలు మొదలుపెట్టింది. రవాణా, ప్రయాణికుల భద్రతాపరమైన సమస్యలు ఉన్నా నగరంలో రోబో ట్యాక్సీ సేవలను అనుమతించిన వారం రోజులకే అధికారులు డ్రైవర్‌ రహిత స్వయంచాలిత బస్సు సేవలకూ పచ్చజెండా ఊపారు. ఈ విద్యుత్తు బస్సు శాన్‌ఫ్రాన్సిస్కో నగరం వద్ద సముద్రంలోని ట్రెజర్‌ ఐలాండ్‌లో ప్రయోగాత్మకంగా మొదలైంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జైలులో నా భర్తపై విషప్రయోగం జరగొచ్చు

తోషాఖానా కేసులో అరెస్టయి, పంజాబ్‌ ప్రావిన్సులోని అటక్‌ జైలులో ఖైదీగా ఉన్న పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై విషప్రయోగం జరిగే అవకాశం ఉందని ఆయన భార్య బుష్రా బీబీ (49) ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను మెరుగైన వసతులున్న జైలుకు తరలించాలని కోరుతూ పంజాబ్‌ హోంశాఖ కార్యదర్శికి శనివారం ఆమె లేఖ రాశారు. ఇమ్రాన్‌ను అటక్‌ జైలు నుంచి రావల్పిండిలోని అదియాలాకు తరలించాలంటూ సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పండగల సీజనులో 50,000 తాత్కాలిక ఉద్యోగాలు

ఈ ఏడాది పండుగ సీజన్‌లో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా(బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో అదనంగా 50,000 వరకు తాత్కాలిక ఉద్యోగాలు రావొచ్చని స్టాఫింగ్‌ కంపెనీ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ అంచనా వేస్తోంది. ఇప్పటికే క్రెడిట్‌ కార్డు విక్రయాలు, వ్యక్తిగత రుణాలు, రిటైల్‌ బీమా వంటి కార్యకలాపాలు బాగా పెరిగాయి. ఆర్థిక వ్యవస్థపై ఉన్న విశ్వాసానికి తోడు వినియోగదారు వ్యయాలు పెరగడం ఇందుకు నేపథ్యం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మనక్‌.. ఎందుకులే అనుకోవద్దు

విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం 2009-10 విద్యాసంవత్సరం నుంచి ఇన్‌స్పైర్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ సహకారంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆధునికీకరించింది. విద్యార్థులు రూపొందించే సైన్స్‌ ప్రాజెక్టులు కేవలం పోటీకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలకు పరిష్కారం, స్వయం ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి, పర్యావరణం తదితర అంశాలతో ముడిపడి ఉండేలా సైన్స్‌ నమూనాలు రూపొందించేలా రూపొందించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని