Kakatiya University: పరీక్ష రాసినా.. రాయనట్టు.. కేయూ డిగ్రీ ఫలితాల్లో వింత

ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: కాకతీయ యూనివర్సిటీ(కేయూ) పరిధిలో రెగ్యులర్‌ డిగ్రీ ఆరో సెమిస్టర్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.

Updated : 20 Aug 2023 10:03 IST

ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: కాకతీయ యూనివర్సిటీ(కేయూ) పరిధిలో రెగ్యులర్‌ డిగ్రీ ఆరో సెమిస్టర్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. జూన్‌లో పరీక్షలు జరగ్గా.. మార్కుల జాబితాల్లో పరీక్షలు రాసినా గైర్హాజరైనట్లుగా ఫలితాలు ప్రకటించడంతో విద్యార్థులు హైరానా పడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ గురుకుల కళాశాల విద్యార్థుల్లో చాలా మందికి ఇదే పరిస్థితి ఎదురైంది. బీఎస్సీ (ఎంపీసీ) చదువుతున్న 31 మంది పరీక్ష రాసినా గైర్హాజరైనట్లుగా ప్రకటించారు.

  •  ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపల్‌ ప్రభుజ్యోతిని వివరణ కోరగా.. కేయూ పరీక్షల విభాగ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని, సోమవారంలోగా పొరపాట్లను సవరిస్తామని చెప్పారని తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని