logo

నాలుగు ప్యాకేజీలుగా మెట్రో విస్తరణ

మెట్రోరైలు మూడో దశ ప్రతిపాదిత మార్గాల ప్రాథమిక ప్రాజెక్ట్‌ నివేదిక(పీపీఆర్‌), సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌)లు తయారు చేసేందుకు కన్సల్టెంట్ల ఎంపికకు హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది.

Updated : 20 Aug 2023 11:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు మూడో దశ ప్రతిపాదిత మార్గాల ప్రాథమిక ప్రాజెక్ట్‌ నివేదిక(పీపీఆర్‌), సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌)లు తయారు చేసేందుకు కన్సల్టెంట్ల ఎంపికకు హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. అర్హత కల్గిన ప్రఖ్యాత కన్సల్టెంట్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఆర్‌ఎఫ్‌సీ) బిడ్లను ఈనెల 28 లోగా సమర్పించాలని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి కోరారు.. శనివారం నుంచి ఆర్‌ఎఫ్‌పీ డాక్యుమెంట్లను హెచ్‌ఎంఆర్‌ఎల్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 28న మధ్యాహ్నం 3.30 తర్వాత టెక్నికల్‌, 30న ఉదయం 11.30 గంటలకు ఫైనాన్షియల్‌ బిడ్లను తెరుస్తారు.

ఇలా విభజించి..:  మెట్రోరైలు విస్తరణలో అవుటర్‌ చుట్టూ మార్గాలను 3 ‘బి’గా, మిగతా మార్గాలను 3 ‘ఏ’గా చేపట్టాలని నిర్ణయించారు.  పీపీఆర్‌, డీపీఆర్‌ రూపకల్పన కోసం ఈ మార్గాలను 4 ప్యాకేజీలుగా విడగొట్టారు.

  • పటాన్‌చెరు-ఇస్నాపూర్‌ (13కి.మీ), ఎల్బీనగర్‌- పెద్ద అంబర్‌పేట (13కి.మీ.), ఓఆర్‌ఆర్‌ పటాన్‌చెరు-కోకాపేట, నార్సింగి ఇంటర్‌ఛేంజ్‌ వరకు మొదటి ప్యాకేజీగా నిర్ణయించారు.
  •  రెండో ప్యాకేజీలో శంషాబాద్‌ జంక్షన్‌- షాద్‌నగర్‌ వరకు(28కి.మీ.), శంషాబాద్‌ విమానాశ్రయం- తుక్కుగూడ- ఫార్మాసిటీ(26కి.మీ.), ఓఆర్‌ఆర్‌ శంషాబాద్‌- బొంగ్లూరు- పెద్ద అంబర్‌పేట వరకు (40కి.మీ.) చేర్చారు.
  •  ఉప్పల్‌- బీబీనగర్‌(25 కి.మీ.), తార్నాక-ఈసీఐఎల్‌(8 కి.మీ.), ఓఆర్‌ఆర్‌ పెద్దఅంబర్‌పేట-ఘట్‌కేసర్‌ -శామీర్‌పేట- మేడ్చల్‌ వరకు (45కి.మీ.) మూడో ప్యాకేజీలో చేర్చారు.
  •   నాలుగో ప్యాకేజీలో డబుల్‌ ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్‌, మెట్రోజేబీఎస్‌- తూంకుంట(17 కి.మీ.), ప్యారడైజ్‌ -కండ్లకోయ (12 కి.మీ), ఓఆర్‌ఆర్‌ మేడ్చల్‌ - -పటాన్‌ చెరు (29 కి.మీ.) చేర్చారు.

50 ఏళ్ల  అవసరాలకు తగ్గట్టుగా..

వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి రాబోయే 40 నుంచి 50 సంవత్సరాల  రవాణా అవసరాలను దృష్టిలో  పీపీఆర్‌, డీపీఆర్‌లను ప్రఖ్యాత కన్సల్టెన్సీల ద్వారా సమగ్ర పద్ధతిలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఎన్వీఎస్‌రెడ్డి, ఎండీ, హైదరాబాద్‌ మెట్రోరైలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని