పండగల సీజనులో 50,000 తాత్కాలిక ఉద్యోగాలు

ఈ ఏడాది పండుగ సీజన్‌లో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా(బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో అదనంగా 50,000 వరకు తాత్కాలిక ఉద్యోగాలు రావొచ్చని స్టాఫింగ్‌ కంపెనీ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ అంచనా వేస్తోంది.

Updated : 20 Aug 2023 10:20 IST

బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో అవకాశం
టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌

ముంబయి: ఈ ఏడాది పండుగ సీజన్‌లో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా(బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో అదనంగా 50,000 వరకు తాత్కాలిక ఉద్యోగాలు రావొచ్చని స్టాఫింగ్‌ కంపెనీ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ అంచనా వేస్తోంది. ఇప్పటికే క్రెడిట్‌ కార్డు విక్రయాలు, వ్యక్తిగత రుణాలు, రిటైల్‌ బీమా వంటి కార్యకలాపాలు బాగా పెరిగాయి. ఆర్థిక వ్యవస్థపై ఉన్న విశ్వాసానికి తోడు వినియోగదారు వ్యయాలు పెరగడం ఇందుకు నేపథ్యం.

  • అహ్మదాబాద్‌, పుణె, బెంగళూరు, కోల్‌కతాతో పాటు కోచి, విశాఖపట్నం, మధురై, లఖ్‌నవూ, చండీగఢ్‌, అమృత్‌సర్‌, భోపాల్‌, రాయ్‌పుర్‌ వంటి నగరాల్లోనూ ఈ ఉద్యోగాలు స్థిరంగా పెరుగుతున్నాయి.
  • గతంలో దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనే బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తుండేవి. గత 2-3 ఏళ్లలో కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్‌లలో కూడా ఈ విభాగానికి సంబంధించిన  టెలీ-ఆపరేటర్ల ఉద్యోగాలు బాగా పెరిగాయి.
  • వచ్చే 5-6 నెలల్లో జాబ్‌ మార్కెట్‌ చురుగ్గా ఉండనుంది. గత నెల నుంచి 25,000 వరకు తాత్కాలిక నియామకాలు జరిగాయి. ఈ సంఖ్య డిసెంబరులోగా 50,000 వరకు చేరొచ్చు.
  • ఇ-కామర్స్‌, రిటైల్‌ రుణాలు, బీమా సేవలు రెండు, మూడో శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించడంతో, అక్కడా ఈ తాత్కాలిక ఉద్యోగాలకు గిరాకీ పెరిగింది.
  • గతేడాదితో పోలిస్తే బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో 7-10 శాతం మేర తాత్కాలిక సిబ్బంది ఆదాయాలు పెరిగాయి.
  • పండగ సీజనులో ఇ-కామర్స్‌, రిటైల్‌, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, వాహనాలు, స్మార్ట్‌ఫోన్లు వంటివాటితో పాటు క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలు, బీమా ఉత్పత్తులకూ గిరాకీ రాణించనుందని అంచనా.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు