Imran khan: జైలులో నా భర్తపై విషప్రయోగం జరగొచ్చు: ఇమ్రాన్‌ భార్య

తోషాఖానా కేసులో అరెస్టయి, పంజాబ్‌ ప్రావిన్సులోని అటక్‌ జైలులో ఖైదీగా ఉన్న పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై విషప్రయోగం జరిగే అవకాశం ఉందని ఆయన భార్య బుష్రా బీబీ (49) ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 20 Aug 2023 09:10 IST

లాహోర్‌: తోషాఖానా కేసులో అరెస్టయి, పంజాబ్‌ ప్రావిన్సులోని అటక్‌ జైలులో ఖైదీగా ఉన్న పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై విషప్రయోగం జరిగే అవకాశం ఉందని ఆయన భార్య బుష్రా బీబీ (49) ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను మెరుగైన వసతులున్న జైలుకు తరలించాలని కోరుతూ పంజాబ్‌ హోంశాఖ కార్యదర్శికి శనివారం ఆమె లేఖ రాశారు. ఇమ్రాన్‌ను అటక్‌ జైలు నుంచి రావల్పిండిలోని అదియాలాకు తరలించాలంటూ సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘70 ఏళ్ల ఇమ్రాన్‌కు ఆయన సామాజిక, రాజకీయ హోదా దృష్ట్యా జైలులో బి-క్లాస్‌ సౌకర్యాలు కల్పించాలి. తనపై గతంలో రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. ఆ కేసులతో సంబంధం ఉన్నవారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. కాబట్టి, ఇమ్రాన్‌ ప్రాణాలకు ఇంకా ప్రమాదం పొంచే ఉంది’’ అని బుష్రా బీబీ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారంటూ ఓ వార్తాసంస్థ పేర్కొంది. అలాగే ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకు తన భర్తకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరినట్లు తెలిపింది. ఇమ్రాన్‌కు మూడో భార్య అయిన బుష్రా బీబీ సూఫీయిజం అనుసరించే ఇస్లామిక్‌ ఆధ్యాత్మికవేత్త.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని