Hyderabad Metro: ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

ఉగాది పండుగ సందర్భంగా మెట్రో ప్రయాణ రాయితీలకు సంబంధించి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ శుభవార్త చెప్పింది.

Published : 08 Apr 2024 18:59 IST

హైదరాబాద్‌: ఉగాది వేడుకల వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. మెట్రో రైలులో వేర్వేరు వర్గాలకు అందిస్తున్న రాయితీలు మార్చి 31తో ముగియగా.. వాటిని మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. ఉగాది వేడుకల్లో భాగంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్‌పాస్‌, సూపర్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లను ఆరు నెలల పాటు పొడిగించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 

సెలవు రోజుల్లో రూ.59కే ప్రయాణ సదుపాయం కల్పించే సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డు, రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం రాయితీ ఇచ్చే సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌లపై రాయితీలన్నీ మార్చి 31 తోనే ముగిసిన విషయం తెలిసిందే. అయితే, ఈ రాయితీలను మళ్లీ పునరుద్ధరిస్తారా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. మెట్రో రైలు మూడు మార్గాల్లో ప్రతిరోజు సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పనిదినాల్లో రద్దీ ఎక్కువగా ఉంటే.. వారాంతాల్లో తక్కువగా ఉంటోంది. వేసవి కావడంతో వాహనాలను స్టేషన్ల వద్ద నిలిపి మెట్రోలోనే ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని