icon icon icon
icon icon icon

Pawan Kalyan: జగన్‌.. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తుడవని అధికారం ఎందుకు?: పవన్‌

కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేని జగన్‌కు అధికారం ఎందుకని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. 

Published : 02 May 2024 21:18 IST

విశాఖ: కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేని జగన్‌కు అధికారం ఎందుకని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మన తలరాతలు మనమే రాసుకోవాలనీ, దోపిడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన కోసం కాదు.. ఐదు కోట్ల ప్రజల కోసం ఆలోచిస్తానని చెప్పారు. నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచించడమన్నారు. బలమైన, బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉత్తరాంధ్రలో సైనికులు, క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారని, విశాఖను ఆర్థిక రాజధానితో పాటు, క్రీడా రాజధానిగా చేస్తామని హామీ ఇచ్చారు. 

‘‘జగన్‌కు చిన్న దెబ్బ తగిలితేనే పెద్ద ప్లాస్టర్‌ వేసి, ముఖమంతా నల్లగా మేకప్‌ వేసుకుని కొంపలు మునిగిపోయినట్టు దీనంగా కూర్చున్నారు. 30వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే వాళ్ల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి ఎప్పుడైనా ఓదార్చారా? వారి బాధలు తెలుసుకున్నారా? 3వేల మంది కౌలు రైతులు చనిపోతే వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? బాపట్ల జిల్లాలో అమర్‌నాథ్‌ గౌడ్‌ అనే పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్‌ పోసి తగలబెడితే ఏం న్యాయం చేశారు? కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తుడవని అధికారం ఎందుకు జగన్‌? కూర్చొని రాజ్యాలు ఏలడానికా? ప్రజలను ఇబ్బంది పెట్టడానికా? 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు ఉండి ప్రయోజనం ఏమిటి? యువత భవిష్యత్‌ కోసం జగన్‌ ఏం ఆలోచించారు. అలాంటి వ్యక్తి మీకు అవసరమా? రూ.5వేలు ఇచ్చే ఉద్యోగంతో సరిపెట్టుకుంటారా? మీ లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేసే నేతలు కావాలా? వద్దా? ఆస్తులు, ఆడబిడ్డల జోలికొస్తే వైకాపా గూండాలకు గుణపాఠం చెబుతాం’’ అని పవన్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img